telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

మనవరాలి వయసున్న బాలికలపై లైంగిక దాడి….

minor raped child in visakha

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ప్రబుద్ధుడు మనవరాలి వయసున్న ముగ్గురు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.  నిజామాబాద్ జిల్లా నవీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జలాల్ పూర్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది గ్రామానికి చెందిన పీరా అహ్మద్ అనే 55 సంవత్సరాల వృద్ధుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికకు డబ్బులు ఇచ్చి చాక్లెట్లు తీసుకోమని చెప్పి నమ్మబలికాడు. అనంతరం గ్రామంలో నిర్మాణం పూర్తయిన నూతన గృహంలో బాలికని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. వరి నాట్లు సీజన్ ప్రారంభం కావడంతో గ్రామంలో మధ్యాహ్నం వేళ ఎవరు ఉండడం లేదు. కుటుంబ సభ్యులతో పాటు కాలనీ వాసులు పొలం పనులకు వెళుతున్నారు. ఇదే అదునుగా భావించిన కామాంధుడు బాలికపై  లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ బాలిక మూడు రోజుల నుండి జ్వరంతో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు గమనించి ఆరా తీయడంతో సదరు బాలిక విషయం చెప్పింది. తన మీదనే కాక మరో ఇద్దరు స్నేహితుల పై లైంగిక దాడికి పాల్పడ్డాడని రోదిస్తూ చెప్పింది. దీంతో ముగ్గురు బాలికల కుటుంబీకులు, కాలనీ వాసులు కలిసి సదరు వ్యక్తికి దేహ శుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసి వృద్ధుడిని అప్పగించినట్లు సమాచారం.

Related posts