telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

మర్డర్ చిత్రం పై హైకోర్టు ఇచ్చిన తీర్పు ను స్వాగతిస్తున్నాం : వర్మ

murder

ప్రణయ్ పరువు హత్య తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ వాస్తవ ఘటన ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే గతంలో ఈ చిత్రాన్ని ఆపాలంటూ.. హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత, ఆయన తండ్రి బాలస్వామి నల్లగొండ జిల్లా కోర్టులో సివిల్ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే తాజాగా శుక్రవారం హైకోర్టు మర్డర్ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రణయ్‌, అమృత పేర్లు, ఫోటోలు, వీడియోలు వాడకూడదని షరతు విధించింది. ఇందుకు చిత్ర బృందం అంగీకరించడంతో సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొల‌గిపోయాయి. దీనిపై నేడు అర్జీవి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ‘నేను చాలా సినిమాలు తీశాను, రియల్ లైఫ్ లో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. నేనెప్పుడూ ఇది రియల్ స్టోరీ అని ఎప్పుడు చెప్పలేదు, కొన్ని సంఘటనల ఆధారంగా నేను తయారు చేసుకున్న కథ ఈ మర్డర్ సినిమా అంటూ తెలిపారు. పిల్లల, పెద్దల ఆలోచనలకు మధ్య వుండే సెన్సిటివ్ విషయాన్ని చెప్పడం జరిగింది, ఈరోజు కోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది సంతోషం అంటూ వ్యాఖ్యానించాడు. ఈ సినిమాలో అమృత ప్రణయ్ అనే పేర్లు పెట్టలేదు, నేనెప్పుడూ వాళ్ళ స్టొరీనే తీస్తున్నాను అని చెప్పలేదు అంటూ తనదైన ధోరణిలో చెప్పుకొచ్చాడు ఆర్జీవి. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా చోట్ల జరుగుతుంటాయి, ఒకరు కరెక్ట్ ఇంకొకరు రాంగ్ అని నేను చెప్పట్లేదు, కొన్ని ఘటనల ఆధారంగా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా తీశాను’ అని వర్మ వివరణ ఇచ్చాడు.

Related posts