telugu navyamedia
సినిమా వార్తలు

“గ్యాంగ్ లీడర్” 6 రోజుల వసూళ్ళు… ఇంకా రాబట్టాల్సింది…?

Gang-Leader

నాని, విక్రమ్.కె.కుమార్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన చిత్రం “గ్యాంగ్ లీడ‌ర్”. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మించారు. ఇందులో ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీలక పాత్రను పోషించారు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందించారు. సెప్టెంబర్ 13న ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో నాని కామెడీ టైమింగ్ కు మంచి స్పందన వస్తోంది. తొలి రోజు ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. ఈ సినిమాకు మూడు రోజుల వరకు టాక్‌తో పని లేకుండా మంచి వసూళ్లే వచ్చాయి. అయితే అసలు ఆట నాలుగో రోజు నుంచి మొదలైంది. వీక్ డేస్ మొదలయ్యే సరికి పూర్తిగా వీక్ అయిపోయాడు “గ్యాంగ్ లీడర్”. ఇప్పటి వరకు ఈ చిత్రం 6 రోజుల్లో కేవలం 16 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. “గ్యాంగ్ లీడర్” తొలిరోజు కేవలం 6 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఆ తర్వాత ఐదు రోజుల్లో మరో 10 కోట్లు మాత్రమే తీసుకొచ్చింది. ఓవర్సీస్‌లో కూడా 8 లక్షల డాలర్లు వసూలు చేసింది ఈ చిత్రం. అక్కడ సేవ్ అవ్వాలంటే 1 మిలియన్ దాటాల్సిందే. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో నాలుగు రోజుల్లో 15 కోట్ల షేర్ వసూలు చేసింది గ్యాంగ్ లీడర్. ఇక్కడ 20 కోట్లకు ఈ చిత్ర రైట్స్ అమ్మారు దర్శక నిర్మాతలు. నైజాంలో 7.50 కోట్లకు రైట్స్ అమ్మగా.. ఇప్పటి వరకు కేవలం 5.80 కోట్లు మాత్రమే వచ్చాయి. సినిమాలో కామెడీ అక్కడక్కడా బాగానే వర్కవుట్ కావడంతో రొటీన్ కథ అయినా కూడా నాని మేనియాలో సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే 30 కోట్ల షేర్ రావాలి. ప్రస్తుతం వచ్చిన టాక్ చూస్తుంటే ఇంత రావడం కష్టమే అనిపిస్తుంది. కానీ నాని అదృష్టం బాగుంటే బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ అయినా అవ్వొచ్చు. కానీ రెండో వారం “వాల్మీకి”తో పాటు సూర్య “బందోబస్త్” సినిమాలు కూడా విడుదల కానున్నాయి. ఈ సినిమాల ఎఫెక్ట్ “గ్యాంగ్ లీడర్”పై ఎంత మేరకు ఉంటుందనేది చూడాలి.

Related posts