telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నాంది నుండి మరో టీజర్…

మహేష్ బాబుతో నటించిన మహర్షి సినిమా తర్వాత అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘నాంది’. సామాజిక అంశాలతో, క్రైమ్‌ థ్రిల్లర్‌ గా వస్తుంది ఈ సినిమా ఇది అల్లరి న‌రేష్ న‌టిస్తోన్న 57వ సినిమా. ఇది అల్లరి న‌రేష్‌ కామెడీ శైలికి పూర్తి భిన్నంగా వినూత్న కథ, కథనాలతో రూపుదిద్దుకుంటోంది. కాగా ఇప్పటికే విడుదలైన ‘నాంది’ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని ఒక సీన్ కోసం నరేష్ ఏకంగా నగ్నంగా కూడా నటించాడట. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ లో… 15 లక్షల మంది చనిపోతే తప్ప స్వాంతంత్య్రం రాలేదు.. 1300 మంది ప్రాణత్యాగం చేస్తే తప్ప కొత్త రాష్ట్రం రాలేదంటూ నరేష్ చెప్పిన డైలాగులు అందరిని ఆకట్టుకుంటున్నాయి. న్యాయం కోసం నా ప్రాణం పోయిన పర్లేదు.. న్యాయం గెలవాలి అంటున్న నరేష్ ‌ను తలకిందులుగా వేలాడదీసారు. అయితే ఈ టీజర్ సినిమా పై అంచనాలను మరింత పెంచింది. ఇక డైరెక్టర్ సతీష్ వేగేశ్న నిర్మాతగా మారి నిర్మిస్తున్న ఈ సినిమాతో విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.ఇక చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ , నవమి, ప్రియదర్శి , ప్రవీణ్, దేవి ప్రసాద్ , శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు .త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులముందుకు రాబోతుంది.

Related posts