సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. ప్రస్తుతం త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా కోసం మేకోవర్ చేంజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.త్వరలో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది.
ఇటీవలే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే గడ్డంతో ఉన్న తన కొత్త లుక్స్‌ను పోస్ట్ చేస్తూ అభిమానుల్ని షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
హీరోలు సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ చూపించడం సహజమే. ఎందుకంటే… మన తెలుగు యువ కథానాయకులు తమ కండలు తిరిగిన దేహాలను వెండితెరపై చూపించారు. అయితే… ఆ ట్రెండ్ కు మహేష్ బాబు దూరమే. ‘వన్ నేనొక్కడినే’ సినిమా కోసం ఆయన సిక్స్ ప్యాక్ ట్రై చేశారు.
అయితే… ముఖంలో మార్పులు వస్తున్నాయని ముందుగా గమనించి ఆ ప్రయత్నం విరమించుకున్నారు. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ షర్ట్ తీసేసిన ఫోటోలను ఆయన పోస్ట్ చేయలేదు.
తాజాగా ఆమె చేసిన మహేష్ ఫొటోస్ ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయి. ఈ ఫొటోస్ లో మహేష్ ని చూసి అభిమానులు పిచ్చెక్కిపోవడం ఖాయం.
ఈ ఫొటోస్ లో మహేష్ బాబు షర్ట్ లేకుండా తన బాడీ చూపిస్తూ స్విమింగ్ పూల్ లో ఉన్నాడు. మహేష్ బాడీ ఫిట్నెస్ చూస్తుంటే కండలు పెంచుతున్నట్లు అర్థం అవుతోంది. ఈ ఫొటోస్ లో మహేష్ అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్డెక్కలేదు : మంచు మనోజ్