telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్ర‌జ‌ల చేతిలో ఉండే ఒకే ఒక్క ఆయుదం ఓటు..బీజేపీ ఓటు ప‌డితే బావి ద‌గ్గ‌ర మీట‌రు ప‌డ్డ‌ట్టే ..

*జై తెలంగాణ అంటూ ప్ర‌సంగం ప్రారంభించిన కేసీఆర్‌
*మునుగోడు ఉప ఎన్నిక ఎవరిని ఉద్ధరించేందుకు?
*ప్ర‌జ‌ల చేతిలో ఉండే ఒకే ఒక్క ఆయుదం ఓటు..
టీఆర్ ఎస్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన సీపీఐకి కేసీఆర్‌ ధ‌న్య‌వాదాలు
*ఈ ఐక్య‌త మునుగోడు నుంచి ఢిల్లీ వ‌ర‌కు కొన‌సాగాలి..
*బీజేపీ ఓటు ప‌డితే బావి ద‌గ్గ‌ర మీట‌రు ప‌డ‌తాయి..
*మీటర్లు పెట్టే బీజేపీ కావాలా? మీటర్లు వద్దన్న టీఆర్‌ఎస్ కావాలా?
*మూడు తోక‌లు ఉన్న వాడు 110 మంది ప‌డ‌గొట్టి పైకి వ‌స్తాడంట‌..?
*మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదు.. మన బతుకు దెరువు ఉపఎన్నిక..
(మోదీ నీ అహంకారమే నీకు శత్రువు..

మునుగోడులో టీఆర్ఎస్ ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సభా వేదికపై పార్టీ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. వేదికపై అమరుల స్తూపానికి సీఎం నివాళులు అర్పించారు. అనంతరం ప్రజా దీవెన సభలో మునుగోడు ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ. .ఫ్లోరైడ్ సమస్యను గతంలో పాలకులు ఎవరూ పట్టించుకోలేదని అన్నారు తెలంగాణ ఉద్యమం చేపట్టిన తరువాత సమస్యను అనేకసార్లు ప్రస్తావించానన్నారు.

నల్లగొండ నగరా పేరుతో 15 రోజుల నాడు జిల్లా మొత్తం తిరిగానని ఉద్యమ సమయం నాటి విషయాలను ప్రస్తావించారు కేసీఆర్. శివన్నగూడెం గ్రామంలో నిద్రించానని చెప్పారు.

కొట్లాట తెలంగాణకు, టీఆర్‌ఎస్‌కు కొత్తకాదని, మునుగోడుతోనే తమ పోరాటం ఆగిపోదని అన్నారు. మునుగోడు నుంచి ఢిల్లీదాకా తమ పోరాటం కొనసాగిస్తామన్నారు

చేతిలో ఉన్న అధికారాన్ని ఎవరికో అప్పగించకూడదని మునుగోడు ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజల చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం ఓటు అని, దానిని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. మాకు మద్దతు ఇచ్చిన సీపీఐకు మునుగోడు వేదిక‌గా కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు నుంచి ఢిల్లీ దాకా కామ్రేడ్లతో ఐక్యత కొనసాగించాల‌ని అన్నారు.

మునుగోడులో గోల్‌మాల్‌ ఉప ఎన్నిక వచ్చిందని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. ‘ఎవరికోసం ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ బైపోల్‌ రావాల్సిన అవసరం ఏముంది. దీని వెనుక ఉన్న మాయామశ్చీంద్ర ఏంటి? అని ప్రశ్నించారు.

8 ఏళ్ల పాలనలో ఏ వర్గానికి మేలు జరిగింది. మోదీ దోస్తులు సూట్‌కేసులు పట్టుకుని రెడీగా ఉన్నారు. కార్పొరేట్ వ్యవసాయం చేద్దామనే కుట్ర జరుగుతోంది. బీజేపీ పాలనలో ఒక్క మంచి పని అయినా జరిగిందా? రాష్ట్రపతి ఎన్నికలప్పుడు 20 ప్రశ్నలు అడిగాను, దేనికీ సమాధనం చెప్పలేదు. బ్యాంకులు, ఎయిర్‌పోర్టుల, విమానాలు, రైళ్లు, రోడ్లు అమ్ముతున్నారు.

మిగిలింది ఇక రైతులు, రైతుల భూములు, పంటలు. మన నోట్లో మట్టి పోసే పని జరుగుతోంది. బావుల వద్ద మీటర్లు పెట్టాలని కేంద్రం అంటోంది. నేను చచ్చినా మీటర్లు పెట్టనని తెగేసి చెప్పిన. బీజేపీ లక్ష్యం ఎరువుల ధరలు పెంచాలి, కరెంట్ రేటు పెంచాలి, పండి పంటకు ధర ఇవ్వకూడదు. మరి వ్యవసాయ భూములకు మీటర్లు పెట్టే బీజేపీ కావాలా? మీటర్లు వద్దన్న కేసీఆర్ కావాలా? మునుగోడు ప్రజలు నిర్ణయించుకోవాల‌ని అన్నారు

బీజేపీకి ఓటు పడితే బావి దగ్గర మీటరు పడతాయి. మూడు తోకలున్న వాడు 110 మందిని పడగొట్టి పైకి వస్తాడట. ఈడీ వస్తే నా దగ్గర చాయ్ తాగించి పంపుతా. దొంగలు బయపడతారు. ఈడీ కాకపోతే బోడి కూడా పంపించు.. నాకేంటి. ఇది దేశం, రాచరిక వ్యవస్థ కాదు. ప్రజలను బెదిరిస్తామంటే సహించే ప్రసక్తే లేదు. నీ అహంకారమే నీకు శత్రువు అవుతుంది మోదీ. రైతు వ్యతిరేక విధానమే నిన్ను పడగొడుతుంది అని కేసీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీపై పోరాటానికి మునుగోడులో ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇది పార్టీల ఎన్నిక కాదని, రైతుల బతుకుదెరువు ఎన్నిక అని పిలుపునిచ్చారు. ఇది తెలంగాణ జీవితం అని, పోగొట్టుకోవద్దని సీఎం కేసీఆర్ తెలిపారు.

Related posts