తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. పోలీసు కేసుల పేరుతో విపక్ష నేతలను భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. పోలీసు కేసులకు భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. రాష్ట్రంలో పాలనను కేసీఆర్ గాలికొదిలేశారని విమర్శించారు.
కేసీఆర్ అడ్డా గజ్వేల్ లో టీఆర్ఎస్ ను ఓడించడమే తమ లక్ష్యమని అన్నారు. కేసీఆర్ దుష్టపాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తిని కలిగిస్తామని చెప్పారు. కుటుంబసభ్యులకు పదవుల పంపకాలపై కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారని విమర్శించారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ, వారికి అండగా నిలుస్తామన్నారు.