రాజధాని అరెస్టులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ విడుదల చేశారు. రాజధాని ప్రాంతంలో రైతులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొడుతోందని పవన్ లేఖలో ఆరోపించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. చినకాకాని వద్ద పోలీసులు వ్యవహరించిన తీరును పవన్ కల్యాణ్ తప్పుబట్టారు.
ఇలాంటి చర్యలతో ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం భావిస్తే అది పొరబాటే అవుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని, అటు పరిపాలన రాజధాని విషయంలో విశాఖ వాసులు కూడా సంతృప్తిగా లేరని ఆరోపించారు.
కుట్రలను బహిర్గతం చేసేందుకే ఢిల్లీకి : మంత్రి ప్రత్తిపాటి