telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మరోసారి తన పెద్దమనసును చాటుకున్న మంత్రి కేటీఆర్…

ktr minister

తొలితరం తెలంగాణ ఉద్యమ కారుడు, డాక్టర్ కొల్లూరి చిరంజీవి గారికి వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. పది లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి కింద తక్షణమే విడుదల చేసింది. ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. డా. చిరంజీవి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆరోగ్యం విషమంగా ఉందని, ప్రైవేట్ దవాఖాన లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వెంటనే చిరంజీవి కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. డా. చిరంజీవి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తక్షణ సాయం కింద 10 లక్షల రూపాయలను ఆస్పత్రి ఖర్చుల కోసం ఇప్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి కూతురు అజిత, ఇతర కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఇదే రోజున తమ తండ్రి పుట్టినరోజు కావడం, ఇదే రోజున ఆపదలో ఉన్న తమను మంత్రి కేటీఆర్ ఆదుకోవడం గొప్ప విషయమని ఆనందం వ్యక్తం చేశారు.

Related posts