telugu navyamedia
క్రీడలు వార్తలు

మరోసారి జడేజా పై మంజ్రేకర్ అనుచిత వ్యాఖ్యలు…

manjrekar tweet kohli as pm

టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంజ్రేకర్‌కు మంచి క్రికెట్‌ పరిజ్ఞానం ఉండడంతో పాటు అంతకుమించి ఇంగ్లీష్ భాషలో గలగలా మాట్లాడుతూ అద్భుతంగా కామెంటరీ చేయగలడు. అయితే ఆ కామెంటరీకి కొన్ని సందర్భాల్లో వివాదాస్పద పదాలు జోడించడంతో.. చాలాసార్లు వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలి కాలంలో తన కామెంటరీకి కన్నా.. వివాదాలతోనే మంజ్రేకర్‌ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. బీసీసీఐ వేటుకు గురైనా కూడా తన పంథా మార్చుకోవడం లేదు. మరోసారి టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై స్పదించాడు.

2019 వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను ‘బిట్స్‌ అండ్‌ పీసెస్‌ క్రికెటర్’‌ అని విమర్శించి అభిమానుల ఆగ్రహానికి గురైన కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌.. మరొకసారి నోరు జారాడు. మరోసారి జడేజానే టార్గెట్‌ చేస్తూ మాట్లాడిన మంజ్రేకర్‌.. అతనితో మాత్రం తనకు వ్యక్తిగతంగా ఎటువంటి ఇబ్బందీ లేదన్నాడు. కానీ ఒక క్రమశిక్షణ అంటూ తెలియని జడేజా లాంటి క్రికెటర్లతోనే తనకు ప్రాబ్లమ్‌ అని పేర్కొన్నాడు. టీమిండియా సెలక్షన్‌లో మంజ్రేకర్‌ సభ్యుడిగా పని చేసిన అనుభవం లేకపోయినప్పటికీ సెలక్షన్‌లో ఆటగాళ్ల క్రమశిక్షణకు పెద్దపీట వేయాలన్నాడు.

తాజాగా సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ… ‘ఇదివరకు నేను కామెంటరీ ప్యానెల్ నుంచి తొలగించబడ్డానని చాలా మందికి తెలియదు. నేను ట్వీట్ చేసేవరకు కొంతమందికి విషయం తెలియదు. ఆ సమయంలో చాలా కష్టంగా అనిపించింది. అయితే నేను ఇలాంటి విషయాలలో దైర్యంగా ఉంటాను’ అని తెలిపాడు.

‘క్రమశిక్షణ ఆధారంగానే ఆటగాళ్లను ఎంపిక చేస్తా. నేను గత కొన్నేళ్లుగా నేర్చుకున్న కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడే క్రికెటర్లను ఎంపిక చేస్తా. ఎవరైతే క్రమశిక్షణలో స్పెషలిస్టులుగా ఉంటారో వారితోనే జట్టును భర్తీ చేయాలి. రవీంద్ర జడేజాతో నాకు ఎటువంటి సమస్య లేదు. కానీ వైట్‌బాల్‌ క్రికెట్‌లో మాత్రం ఆ తరహా క్రికెటర్లతోనే సమస్య. నా జట్టులో చివరికి హార్దిక్‌ పాండ్యా లాంటి ఆల్‌రౌండర్‌ను కూడా ఎంపిక చేయను. ఆ తరహా క్రికెటర్లు భ్రమను కల్పించే వారు మాత్రమే. అయితే జడేజాను టెస్టు క్రికెటర్‌గా మాత్రమే భావిస్తా. లాంగెస్ట్‌ ఫార్మాట్‌లో మాత్రం అతనికి ఫుల్‌ మార్క్స్‌ వేస్తా’ అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

Related posts