telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

స్వప్నసుందరి…

తన కోసం మల్లెపూల పొదరింట్లో మంచమేసి
తన కోసం కాగడాల పూలను దీపాలు వెలిగించి
తన కోసం రేరాతిరిలో చుక్కలన్నీ చుట్టేసి
తన కోసం శారీలో అందాలుగా మెరుగులద్దేసి
తన కోసం ఆమె చీరకొంగులో పెట్టేసి
తన కోసం ఆకాశాన్నంతా చుట్టేసి పాన్పుగా పర్చేసి
తన కోసం పండువెన్నెల్లో పారిజాత వృక్షం మొలిపించి
తన కోసం ప్రకృతిలో నవవసంతపూలన్నీ తెచ్చేసి
తన కోరగానే ఆమె కొప్పులో నేనెట్టేసి
ఆమె నా బిదికౌగిలిలో బంధించి
ఆమె నాకోసం పుట్టినట్టు నా నవ్వుల రాణిగా చేస్కొని
ఆమెలో తనువులో విరబూసిన తియ్యని అందాలన్నీ
నాకోసమే తన తనువు శృంగార విందుగా పేర్చినట్టు
ఆమెలో తనువులో ప్రతి అంగాంగం నెమ్మదిగా నిమిరి
నేను కలగంటినోయ్..
కలలో నా స్వప్నసుందరినీ చూసి
నాలో నా యెదలో సవ్వడిలో
నా ప్రతి ఊహల సడి ఆమెదేనోయ్
నా గుండే గుడి గంట మోగిందోయ్
ఆమెనోయ్ నన్ను నా ప్రేమ భావాల్ని పెంచిందోయ్
నాలో ఎన్నెన్నో రాగాలు
నాలో భావాలెన్నో పేర్చిదోయ్
ఆమెనోయ్ నాలో మదిలో ప్రేమ దీపం వెలిగించిందోయ్

Related posts