telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల కానున్న 7 సినిమాలు ఇవే

producers serious on amazon prime

లాక్ డౌన్ నేపథ్యంలో థియేటర్స్‌లో సినిమా విడుదలై చాలా రోజులైపోయింది. ఇక తిరిగి షూటింగ్‌లు ఎప్పడు ప్రారంభమౌతాయో తెలియని పరిస్థితి. ఇక లాక్ డౌన్ ఎత్తేసినా ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారా? అనేది కూడా అనుమానమే. ఈ తరుణంలో రానున్న రోజుల్లో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ హవా చూపించబోతుండటంతో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్, జీ5, హలోలలో డైరెక్ట్‌గా సినిమాలు విడుదల చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఈ తరుణంలో జూన్ 19 నుంచి ఎక్స్ క్లూజివ్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియో‌లో కీర్తి సురేశ్ ‘పెంగ్విన్’, జ్యోతిక ‘పొన్ మగల్ వంధల్’ చిత్రాలతో మరికొన్ని చిత్రాలను డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషలకు చెందిన ఏడు సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ సినిమాలు రానున్న మూడు నెలల్లో ప్రైమ్ వీడియోపై ఎక్స్ క్లూజివ్‌‌గా ప్రసారం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు మరియు టెరిటరీస్‌లలో వీటిని వీక్షించవచ్చు. “పెంగ్విన్” సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్ లోనే జాన్ 19న‌ విడుద‌ల చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న తొలి తెలుగు సినిమా పెంగ్వీన్ కావడం విశేషం.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా ప్ర‌సారం కానున్న చిత్రాల లిస్ట్ :
1. పొన్ మగల్ వంధల్ (తమిళం)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల తేది – మే 29, 2020.
తారాగ‌ణం – జ్యోతిక, ప్రతిబన్, భాగ్యరాజ్, ప్రతాప్ పోతన్, పాండియరాజన్
రచన, దర్శకత్వం – జె.జె. ఫ్రెడరిక్
నిర్మాతలు – సూరియ, రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్

2. గులాబో సితాబో (హిందీ)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల తేదీ – జూన్ 12, 2020.
తారాగ‌ణం – అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా .
రచన – జూహి చతుర్వేది.
దర్శకత్వం – షూజిత్ సిర్కార్
నిర్మాత‌లు – రోన్ని లాహిరి, శీల్ కుమార్.

3. పెంగ్విన్ (తమిళం, తెలుగు),
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల తేది – జూన్ 19, 2020
తారాగ‌ణం- కీర్తి సురేశ్.
రచన, దర్శకత్వం – ఈశ్వర్ కార్తీక్.
నిర్మాత‌లు – స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, కార్తీక్ సుబ్బరాజ్.

4. లా (కన్నడ).
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల తేది – జూన్ 26, 2020.
తారాగ‌ణం – రాగిని చంద్రన్, సిరి ప్రహ్లాద్, ముఖ్యమంత్రి చంద్రు.
రచన, దర్శకత్వం – రఘు సమర్థ్
నిర్మాతలు – అశ్విని, పునీత్ రాజ్ కుమార్

5. ఫ్రెంచ్ బిర్యానీ (కన్నడ).
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల తేది – జూలై 24, 2020.
తారాగ‌ణం – డానిష్ సెయిత్, సాల్ యూసుఫ్, పిటో బాష్.
రచన – అవినాశ్ బాలెక్కాల.
దర్శకత్వం – పన్నాగ భరణ.
నిర్మాతలు – అశ్విని, పునీత్ రాజ్ కుమార్, గురుదత్ ఎ తల్వార్

6. శకుంతలా దేవి (హిందీ).
తారాగ‌ణం – విద్యాబాలన్ర.
ర‌చన – నాయనిక మహ్తాని, అనూ మీనన్.
దర్శకత్వం – అనూ మీనన్.
నిర్మాత‌లు – అబున్ డాంటియా ఎంటర్ టెయిన్ మెంట్ ప్రై.లి., సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా.

7. సుఫియాం సుజాతాయం (మలయాళం)
తారాగ‌ణం – అదితి రావు హైదరీ, జయ సూర్య‌.
రచన, దర్శకత్వం – నరని పుజా షానవాస్
నిర్మాణం – విజయ్ బాబు ఫ్రైడే ఫిల్మ్ హౌస్.

Related posts