telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అక్కడ లాక్‌డౌన్ అవసరం లేదు అని చెప్పిన సుప్రీం…

court

రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితుల దృష్ట్యా ప‌లు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించాలంటూ ఉత్త‌ర‌ప్రదేశ్ స‌ర్కార్‌కు ఆదేశాలు జారీ చేసింది అల‌హాబాద్ హైకోర్టు.. ప్రయాగ్‌రాజ్, లక్నో, వారణాసి, కాన్పూర్ నగర్, గోరఖ్‌పూర్ లాంటి ఐదు న‌గ‌రాల్లో ఈ నెల 26వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ విధించాలంటూ సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది.. కానీ, హైకోర్టు ఆదేశాల‌ను సుప్రీంకోర్టులో యోగి ఆదిత్య‌నాథ్ స‌ర్కార్ స‌వాల్ చేయ‌గా.. వారికి ఊర‌ట ద‌క్కింది. అల‌హాబాద్ హైకోర్టు ఆదేశాలను నిలిపివేసిన సుప్రీంకోర్టు.. లాక్‌డౌన్ అవసరం లేదని స్ప‌ష్టం చేసింది. కాగా, కోవిడ్ కేసులు పెరుగుతున్నా.. యూపీ ప్ర‌భుత్వం స‌రైన విధంగా స్పందించ‌డం లేద‌ని వ్యాఖ్యానించిన అల‌హాబాద్ హైకోర్టు.. తక్షణ చర్యలు తీసుకోకపోతే వైద్య వ్యవస్థ కుప్పకూలుతుందని పేర్కొంది.. ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లోని ఐసీయూల్లో కోవిడ్ బాధితుల‌ను వీఐపీల సిఫారసుల మేర‌కే చేర్చుకుంటున్న‌ట్టు త‌మ దృష్టికి వ‌చ్చింద‌న్న జస్టిస్ అజిత్ కుమార్, సిద్ధార్ధ వర్మలతో కూడిన డివిజన్ బెంచ్… రాష్ట్ర సీఎం సైతం లక్నోలో ఐసొలేషన్‌లో ఉన్నార‌ని తెలిపింది.. కోవిడ్ కేసుల‌ను దృష్టిలో పెట్టుకుని.. ప్రయాగ్‌రాజ్, లక్నో, వారణాసి, కాన్పూర్ నగర్, గోరఖ్‌పూర్‌ నగరాల్లో లాక్‌డౌన్‌కు ఆదేశాలిచ్చింది. అయితే, హైకోర్టు ఆదేశాల‌ను సుప్రీంకోర్టులో స‌వాల్ చేసింది యోగి స‌ర్కార్.. లాక్‌డౌన్ విధించలేమని స్ప‌ష్టం చేసిన ప్ర‌భుత్వం.. మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొంది.. ఇక‌, హైకోర్టు ఆదేశాల‌ను సుప్రీంకోర్టు నిలిపివేయ‌డంతో.. యోగి స‌ర్కార్‌కు ఊర‌ట ల‌భించిన‌ట్టు అయ్యింది.

Related posts