కొన్ని తునకలైన ఆశలో
పగిలిపోయిన లక్ష్యాలో
వాడిపోయిన ఇష్టాలో
ముళ్ళలా మారి మదిని గుచ్చుతుంటే
కళ్ళను మెలకువలో ముంచిన రాతిరొకటి
చీకటింట వేలాడుతుంటది
కన్నీటి జ్ఞాపకాలని మోస్తున్న ఓ దేహం
కలతనిద్రల్లో సంచరిస్తుంటది..!!
ఉషోదయాలను పలకరించని మనసెప్పుడూ
నిరాశల్ని పోగేసుకుని నిశీధిలో ఊరేగుతూ
గతం గురుతులని తొలిచి బాధపడుతుంటది..!!
రోజులన్నీ ప్రవహించి మాసాల్లోకి సంగమించాక
కాలం పంపిన వసంతమొకటి హృదయం చెట్టుకి
పచ్చటి ఆకుల్ని తప్పక పూయిస్తుంది
చేయాల్సిందల్లా నమ్మకమనే నీరు పోయడమే..!!
పగలూ, రాత్రిల జోడెడ్లబండి జీవితంలో
నిరాశల ఆటంకాలెన్ని అడ్డుపడ్డా
మనిషిని బ్రతికించేవి
రేపటిని రెపరెపలాడించ
మనసున నిత్యం చిగురించే ఆశలే..
ఆత్మవిశ్వాసపు రహదారుల్లో సాగుతూ
కొత్త గమ్యాలను ఏరుకోవడమే బ్రతుకంటే..!!
నిర్మాత పడకగదికి రమ్మన్నాడు…నటి ఆరోపణలు