telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

తొందరపడుతున్న బన్నీ… ఎందుకు..?

Pushpa

అల్లు అర్జున్ ప్రస్తుతం సుమార్  తో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. దీని తరువాత కొరటాల శివతో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ప్రకటన ఎప్పుడో వచ్చిన  తెలిసిందే . ఈ మూవీని కూడా  ‘పుష్ప’ మూవీలా ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్నారు. అయితే ప్రస్తుతం కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఆచార్య సినిమా దాదాపు పూర్తి కావస్తుంది. కాబట్టి ఆచార్య పూర్తయేలోపు పుష్పను కూడా పూర్తిచేయాలని బన్నీ నిర్ణయిచుకున్నట్లు తెలుస్తుంది. అందుకే పుష్ప షూటింగ్ వేగం పెంచాడంట…! ఇప్పటికే బన్నీ-కొరటాల శివ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించారంట. అయితే ఈ సినిమాను 2022 మార్చిలో విడుదల చేయాలనీ చిత్రబృందం అనుకుంటుంది. అయితే ఈ సినిమాలో నటీనటుల విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ ను ఈ చిత్రంలో నటింపజేయాలనుకుంటున్నారట. బాలీవుడ్ హీరోయిన్ తో పాటు విలన్ మరియు కీలకమైన మరో పాత్రలో కూడా బాలీవుడ్ నటుడిని నటింపజేయబోతున్నారట. దీంతో బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టికి ఈ సినిమాను తీసుకువెళ్లవచ్చు అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది.

Related posts