telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు సామాజిక

వర్షాకాలం మొదలు.. నేడు, రేపు ..

rains started today and tomorrow in telangana

వేసవి వేడికి మాడిపోయిన ప్రజలకు వాతావరణం చల్లబడి ఉపశమనం ఇచ్చింది. అయితే వర్షకాలం సమస్యలు తప్పవు కదా.. తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సాయంత్రం కొన్ని జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈదురు గాలులకు చాలా ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. చెట్టు కూలి పడడంతో ఓ ఎద్దు మృతి చెందింది.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పిడుగు పాటుకు ముగ్గురు మృతి చెందారు. కొన్ని జిల్లాల్లో వాతావరణం చల్లబడితే, మరికొన్ని జిల్లాల్లో మాత్రం భానుడి ప్రతాపం కొనసాగింది. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 45.3 డిగ్రీలు, భద్రాచలంలో 42.8, హైదరాబాద్‌లో 42.7, ఖమ్మంలో 44.2, మహబూబ్‌నగర్‌లో 43, మెదక్‌లో 40.2, నల్లగొండలో 43.6, నిజామాబాద్‌ లో 45, రామగుండంలో 43.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Related posts