telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

నటుడు డాక్టర్‌ శ్రీరామ్‌ లాగూ … మృతి..

actor dr.sriram lagu died

ప్రముఖ రంగస్థల కళాకారుడు, బాలీవుడ్‌ నటుడు డాక్టర్‌ శ్రీరామ్‌ లాగూ(92) కన్నుమూశారు. వయసు వల్ల వచ్చే అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీరామ్ లాగూ పుణెలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. మహారాష్ట్రలోని సాతారా జిల్లాలో 1927 నవంబర్‌ 16న శ్రీరామ్‌లాగూ జన్మించారు. ఇప్పటివరకు ఆయన వందకు పైగా హిందీ, మరాఠీ, గుజరాతీ చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన మరాఠీ చిత్రాల్లో సిన్‌హాసన్‌(1980), సామన(1974), పింజ్రా(1973) ప్రముఖమైనవి. బాలీవుడ్‌ చిత్రాలైన జమానే కో దిఖానా హై(1981), ఖుద్దార్‌(1994), లావారిస్‌(1981), ఇన్‌సాఫ్‌కా తారాజు(1980) మొదలైన చిత్రాల్లో నటించారు. ఘరొండ చిత్రంలో ఉత్తమ నటనకుగానూ 1978లో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. మరాఠా చిత్రాల్లో ఆయనను నటసామ్రాట్‌ అని పిలుస్తారు.

హిందీ, మరాఠీ, గుజరాతీ భాషలలో దాదాపు 211 సినిమాల్లో నటించిన శ్రీరామ్.. ఘరొండ చిత్రంలో ఉత్తమ నటనకుగానూ 1978లో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. పూణే యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఎంఎస్ అభ్యసించారు. ఈఎన్‌టీ సర్జన్‌గా కూడా ప్రాక్టీస్ చేశారు. ఆయన సతీమణి దీపా లాగూ కూడా చిత్రసీమకు సంబంధించిన వారే. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Related posts