telugu navyamedia
సినిమా వార్తలు

ఎఫ్-2 : ప్రీమియర్ షో టాక్ 

F2 Movie pre release event images
సంక్రాంతి బరిలో టాలీవుడ్ లో భారీ చింతలు విడుదలవుతూ పోటీ పడుతున్నాయి. 9వ తేదీన కథానాయకుడు, 10న పెట్ట, 11న వినయ విధేయ రామ చిత్రాలు విడుదలయ్యాయి. అయితే పేట తమిళనాడులో విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇక కథానాయకుడు, వినయ విధేయ రామ విభిన్నమైన టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈరోజు ఎఫ్-2 చిత్రం విడుదలైంది.
వెంకటేష్, వరుణ్ తేజ్ కథనాయకులుగా తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ కి అనిక్ రావిపూడి దర్శకత్వం వహించారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ముందుగా ఎఫ్-2 యూఎస్ ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. ప్రీమియర్ షో టాక్ ఏంటో చూద్దాం. 
పెళ్లికి ముందు పెళ్లి తరువాత మగాళ్ల జీవితం ఏమిటి అనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ట్రైలర్ లోనే తెలిసిపోయింది. వెంకటేష్ చాలా రోజుల తరువాత మంచి కామెడీ టైమింగ్ పాత్రను చేయగా, వరుణ్ తేజ్ తెలంగాణ యువకుడిగా పోటీ పడి మరీ నటించి ఆకట్టుకున్నాడు. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ సినిమా ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచేలా ఉంటుంది.
ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో ఆ ఫన్ కి ఫ్రస్ట్రేషన్ జోడించి మరింత ఎంటర్టైన్ చేశాడని అంటున్నారు. తమన్నా, మెహ్రీన్ లు తమ నటనతో మెప్పించారు. ఇక రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్ పాత్రలు కూడా ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. అయితే అక్కడక్కడా కొంచెం రొటీన్ కామెడీ సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. మొత్తంగా కథలో కొత్తదనం లేకపోయినా స్క్రీన్ ప్లే మాత్రం కొత్తగా ఉంది. మరి సినిమాపై ప్రేక్షకుల తుది తీర్పు ఏమిటో చూడాలి.

Related posts