telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రష్మిక, నితిన్ డ్యాన్స్ పై హృతిక్ ప్రశంసలు

Bhishma

నితిన్‌, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక, నితిన్‌ కలిసి హృతిక్‌ రోషన్‌ వార్‌ సినిమాలోని గుంగ్‌రూ సాంగ్‌కు స్టెప్పులేసిన వీడియోను హృతిక్‌రోషన్‌కు రష్మిక ట్యాగ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వీడియోను చూసిన హృతిక్‌ “స్వీట్‌..రష్మిక, నితిన్‌ కృతజ్ఞతలు. బీష్మ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా. లవ్‌ యూ” అంటూ రీట్వీట్‌ చేశాడు. తన ట్వీట్‌కు హృతిక్‌ స్పందించడంతో రష్మిక ఎగిరి గంతేసింది. “మా టీంకు శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు సర్‌. ఏదో ఒక రోజు మిమ్మల్ని కలుస్తా… ఇవే స్టెప్పులు మీతో వేస్తాను” అని ట్వీట్‌ చేసింది.

Related posts