telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతులు తీసుకొచ్చిన ప్రతి ధాన్యం గింజ కొనాల్సిందే

వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో, ఐకెపి, గూడూరు గ్రామంలో వ్యవసాయ సహకార సంఘం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఈటల, ప్రణాలిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చెప్పిన పంట వేశామని గ్రామాల్లో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని…రైతులకు ప్రభుత్వం మీద ఇంత నమ్మకం ఉందన్నారు. రైతులకు దేశంలో గాని ప్రపంచదేశాలలో కానీ మన ప్రభుత్వం చేసిన సహాయం ఎక్కడా లేదని..దేశంలో కరోనా వచ్చి ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా పథకాలు అమలుచేసి ఆర్థికంగా నిలదొక్కుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. గత నాయకుల మాదిరిగా కాకుండా గ్రామాలు బాగు పడాలి మా రైతుల బతుకులు బాగు పడాలని.. తెలంగాణ దేశ చిత్ర పాఠం మీద గొప్పగా నిలబడాలి అనే ఎజెండాతో పని చేస్తున్నామన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు,ఎంపీలు ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యనే తిరుగుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. రైతులు తీసుకొచ్చిన ప్రతి ధాన్యం గింజ కొనాల్సిందేనని…తాలు,తప్ప రంగు మారింది అని ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని మిల్లులలో ఆలస్యం చేయకుండా దిగుమతి చేసుకోవాలన్నారు.

Related posts