telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ తర్వాత నేనేంటో అందరికీ తెలిసింది : నవదీప్

navadeep

టాలీవుడ్ యువ నటుడు యంగ్ హీరో నవదీప్ తాజా ఇంటర్వూలో తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. అప్పుడెప్పుడో చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ కారణంగా నా పై బ్యాడ్ బాయ్ ముద్ర పడింది. కానీ బిగ్ బాస్ తర్వాత నేనేంటో అందరికీ తెలిసింది. ఆ తర్వాత అందరూ నన్ను మంచివాడిగా గుర్తించడం మొదలెట్టారు. అందుకే ఈ సందర్భంగా బిగ్‌బాస్‌కు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు నవదీప్. సిక్స్ ప్యాక్ బాడీతో చూసేవాళ్లు సర్‌ప్రైజ్ అయేలా తయారైన నవదీప్.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయిపోయాడు. త్వరలో విలన్‌గానూ దర్శనమివ్వబోతున్నాడు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘మోసగాళ్లు’ చిత్రంలో నవదీప్ విలన్‌గా నటిస్తున్నాడు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మంచి మంచి పాత్రలు వస్తున్నాయని, గత సంవత్సర కాలంగా తన కెరీర్ గాడిన పడిందని తెలిపాడు యంగ్ హీరో నవదీప్.

Related posts