telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అండర్‌వరల్డ్‌ మాఫియా నేపథ్యంలో వర్మ వెబ్ సిరీస్

Ram-Gopal-Varma

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా పేరు ప్రకటించేలోపే మరో సినిమాను విడుదల చేస్తుంటాడు. తాజాగా ముంబై అండర్‌వరల్డ్‌ మాఫియా నేపథ్యంలో ఓ వెబ్‌సిరీస్‌ తీస్తానని ప్రకటించాడు వర్మ. మాఫియా, క్రైం బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యంలో ఇప్పటికే సత్య, కంపెనీ అనే సినిమాలు తీశాడు. వెబ్‌సిరీస్‌ విషయమై వర్మ మాట్లాడుతూ..గత రెండు దశాబ్దాల నుంచి నెలకొన్న పరిస్థితులపై చాలా పరిశోధించి కీలక విషయాలు సేకరించాను. నేను సిద్దం చేసిన కథను చూపించాలంటే కేవలం వెబ్‌సిరీస్‌ అయితేనే సంపూర్ణ న్యాయం జరుగుతుంది. ఇటీవలే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన మిగిలిన విషయాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పాడు వర్మ. కడప అనే వెబ్‌సిరీస్‌పై కూడా పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. అయితే విడుదల తేదీ ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు.

Related posts