telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ విద్యా వార్తలు

ఆంధ్రవిశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్ గా బాధ్యతలు తీసుకున్న … డా.టి.బైరాగిరెడ్డి ..

dr.t.bairagireddy takes charge as A.U. registrar

ఆంధ్రవిశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్ గా డా.టి.బైరాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎవరు, ఈ పదవికి ఎలా అర్హులు అనేవి పరిశీలిస్తే.. పూర్తీ పేరు తాటిపర్తి.బైరాగిరెడ్డి. 4 ఆగష్టు, 1960లో జన్మించారు. 1982లో ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండే ఎంఎస్సీ-బోటనీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఒంగోలు ఆంధ్రవిశ్వవిద్యాలయంలో సీఎస్ఆర్ శర్మ కాలేజీ నుండి డిగ్రీ చేశారు. 30ఏళ్ళ పరిశోధనా అనుభవం, 25 ఏళ్ళ ఉపాధ్యాయులుగా అనుభవం. 2002 నుండి 75 పరిశోధనలు..22 పీహెచ్డీ లు, 10 ఎంఫిల్ లతో .. ప్రస్తుతం ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో ప్రొఫెసర్ గా ఆంధ్రవిశ్వవిద్యాలయం, విశాఖపట్నంలో వారి సేవలను అందిస్తున్నారు.

ఆయన తమ పరిశోధనలలో భాగంగా పలు జాతీయ-అంతర్జాతీయ సైన్స్ సమావేశాలలో పాల్గొన్నారు. ఓపెన్ యూనివర్సిటీ, డిస్టెన్స్ విద్యను అందిస్తున్న ఆంధ్రవిశ్వవిద్యాలయం, అంబేద్కర్ విశ్వవిద్యాలయాలకు పాఠ్యాంశాలను అందిస్తున్నారు. దాదాపు పది విశ్వవిద్యాలయాలకు ఆయన తన సేవలను వివిధ రూపాలలో అందిస్తున్నారు. ఏపీ విద్యావ్యవస్థలో పలు మార్పులకు తెరతీసిన ప్రస్తుత సీఎం, బైరాగిరెడ్డి ని ఆంధ్రవిశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్ గా నియమించిన విషయం తెలిసిందే. నేడు ఆయన బాధ్యతలు స్వీకరించారు.

Related posts