telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వచ్చే నెల 4న ఏపీలో కేంద్ర బృందం పర్యటన

Red zone corona

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం పై అధ్యయనం చేయడానికి మే 4వ తేదీన కేంద్ర బృందం పర్యటించనుంది. కరోనా తాజా పరిస్థితి, లాక్‌డౌన్‌ అమలు తీరు, కరోనా బాధిత రోగులకు అందుతున్న వైద్యం, తదితర అంశాలపై బృందం సమీక్ష నిర్వహించనుంది. రెడ్‌జోన్‌, గ్రీన్‌జోన్‌, ఆరెంజ్‌జోన్లలో తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేయనుంది.

ఇప్పటి వరకు ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు 1403కు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 71 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అధ్యధికంగా కర్నూల్‌ జిల్లాలో 43 కేసులు, గుంటూరు జిల్లాలో 10 కేసులు, గుంటూరులో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 321 మంది బాధితులు చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ కాగా, ప్రస్తుతం 1051 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Related posts