telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నీలం సాహ్నీ స్వామి భక్తి చాటుకుంటున్నారు…

janasena

ఏపీలోని రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ నీలం సాహ్నీ ఇవాళ భేటీ అయ్యారు. అయితే.. ఎస్ఈసీ నీలం సాహ్నీ నిర్వహించిన సమావేశాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన బహిష్కరించాయి. అటు కాంగ్రెస్‌ పార్టీ మాత్రం భేటీకి హాజరై.. తమ నిరసనను తెలిపాయి. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నీలం సాహ్నీ, వైసీపీ ప్రభుత్వంపై జనసేన నాయకులు పోతిన మహేష్ మండిపడ్డారు. ఐదు కోట్ల ప్రజలను నీలం సాహ్నీ ఏప్రిల్ ఫూల్ చేశారని… నీలం సాహ్నీ ఎస్ఈసీగా వచ్చారా..? లేక జగన్ చెప్పింది చేయడానికి వచ్చారా..? అని నిలదీశారు. కొత్త ఎస్ఈసీకి కోర్టులంటే గౌరవం లేదని.. కోర్టు తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేయలేకపోయారా..?అని ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నికల నిర్వహణను గందరగోళం చేసేందుకే పరిషత్ ఎన్నికల నిర్వహణ జరుగుతుందని ఫైర్‌ అయ్యారు. జగన్ చెప్పారు.. నీలం సాహ్నీ ఆచరించారని మండిపడ్డారు. నీలం సాహ్నీ స్వామి భక్తి చాటుకుంటున్నారని… జగన్ నేతృత్వంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని.. గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో అరాచకాలు సృష్టించారని జనసేన నాయకులు పోతిన మహేష్ ఫైర్‌ అయ్యారు. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశామని.. కోర్టు ఉత్తర్వులు లెక్క చేయకుండా పరిషత్ ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడం అప్రజాస్వామిక చర్య అని… రాజకీయ పార్టీల సమావేశాన్ని ఆహ్వానించి.. నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

 

Related posts