telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మహా ధర్నాకు .. సిద్దమవుతున్న అమరావతి రైతులు..

amaravati farmers protest on capital issue

అమరావతి పరిధిలోని గ్రామాల రైతులు మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. తూళ్లూరులో నిర్వహిస్తున్న మహాధర్నాకు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మందడంలో ప్రధాన రహదారిని రైతులు దిగ్బంధించారు. రోడ్డుపై అడ్డంగా పడవను పెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పడవను బలవంతంగా పక్కకు తొలగించారు.

రోడ్డుపై టెంటు తీసి ఉదయాన్నే వేసుకోండని గత రాత్రి డీఎస్పీ చెప్పారని, ఇప్పుడు టెంటు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు వైకాపా కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.’ పంచాయతీ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగునే మేమే తుడిచేశాం. మేం నల్ల రంగు వేయటం తప్పైతే…, పార్టీ రంగు పంచాయతీ కార్యాలయానికి వేయటం తప్పుకాదా?’ అంటూ ప్రశ్నించారు. పోలీసులపై ప్రైవేటు కేసులు పెడతామని హెచ్చరించారు.

Related posts