లాక్‌డౌన్ సమయంలో తన హోమ్ క్వారంటైన్ విశేషాలు తెలుపుతూ అభిమానులను పలకరిస్తున్నారు మాస్ మహారాజ్ రవితేజ. తన కొడుకు, కూతుర్లతో సరదాగా గడుపుతున్నారు. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘క్రాక్’. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. దీని తర్వాత కొనేరు సత్యనారాయణ నిర్మాణంలో రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన వార్తొకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది. అదేంటంటే ఈ చిత్రంలో రవితేజ డ్యూయెల్ రోల్‌లో కనిపించనున్నాడు. అందులో ఓ పాత్ర పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా.. మరో పాత్ర కిల్లర్ పాత్రట. ఈ రెండు పాత్రల మధ్య సాగే మైండ్ గేమ్ ప్రధానంగా సాగే చిత్రమిదని వార్తలు వినపడుతున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే చిత్రబృందం స్పందించాల్సిందే.
next post