సినీ నటి, వైసీపీ నేత రమ్యశ్రీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై ప్రశంసలు కురిపించారు. ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి వైఎస్ జగన్ అని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులిబిడ్డ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు . ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఓ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె వైఎస్ జగనే ఏపీ సీఎం అవుతారని చెప్పారు.
ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి వైఎస్ జగన్ అని తెలిపారు . 40 ఏళ్లు సీఎంగా జగనే ఉంటారని ఆమె జోస్యం చెప్పారు. ప్రజల మనసులను గెలుచుకున్న వ్యక్తి వైఎస్ జగన్ అని అందువల్ల ఓటమి అనేది ఆయన ఇక ఎరుగడన్నారు. గతంలో దివంగత సీఎం ఎన్టీఆర్, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు కూడా ప్రజలు మనసులు గెలుచుకున్నారని అందుకే వారు తిరుగులేని నాయకులు అయ్యారని అలాగే వైఎస్ జగన్ కూడా తిరుగులేని నేత కాబోతున్నారని రమ్య శ్రీ పేర్కొన్నారు.
మీటూపై తాప్సి వ్యాఖ్యలు