telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల నిరసన.. ఈరోజు..?

దేశరాజధాని శివారులో కొత్త వ్యవసాయ చట్టాలకు రద్దు చేయాలంటూ రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి… రైతుల ఆందోళనలు 17వ రోజుకు చేరుకున్నాయి.. ఇక, రైతుల ఆందోళనలకు రోజురోజుకు మద్దతు పెరుగుతూనే ఉంది.. తాజాగా అమృత్‌సర్‌లోని కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ సభ్యులు, సమాజ్‌వాదీ పార్టీ మద్దతు పలికాయి. కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ సభ్యులు 7 వందల ట్రాక్టర్లతో రాజధానికి చేరుకున్నారు. 16 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా ఇవాళ.. ఢిల్లీ-జైపూర్‌, ఢిల్లీ-ఆగ్రా రహదారులు దిగ్బంధించనున్నారు. టోల్‌గేట్ల వద్ద రుసుం చెల్లించకుండా నిరసన తెలపనున్నారు. ఈనెల 14న ఉత్తర భారతదేశంలోని రైతులంతా ఢిల్లీని ముట్టడించాలని, దక్షిణ భారతదేశంలోని రైతులు జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. చర్చల్లో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగించాలని.. చర్చలకు రావాలని ఓవైపు కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది.. మరోవైపు… కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదలను తిరస్కరించిన రైతులు.. ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. చూడాలి మరి ఇది ఇప్పటివరకు కొనసాగుతుంది అనేది.

Related posts