telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వ్యాక్సిన్ విషయంలో కేంద్రం తీరును తప్పుబట్టిన రాహుల్

Rahul gandhi congress

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిత్యమూ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా ఏదో ఒక విమర్శ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా వైరస్ విషయంలో రాహుల్ తనకు లభించే ఏ అవకాశాన్నీ ఆయన వదులుకోవడంలేదు. కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్రం తీరును రాహులు తప్పుబట్టారు. టీకా విషయంలో కేంద్రం సక్రమంగా వ్యవహరించడం లేదని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

వైరస్ ఇప్పటికే 33 లక్షల మందికి పైగా సోకిందని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ కేంద్రం పారదర్శక వ్యూహంతో వెళ్లడం లేదని ఆరోపించారు. ఈ పరిస్థితి దేశాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టవచ్చని రాహుల్ హెచ్చరించారు. వ్యాక్సిన్ పై కేంద్రం వ్యూహం ఏంటో, ఎప్పుడు తెస్తారో తెలియజేయాలంటూ రాహుల్ ట్విట్టర్ కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై దేశ ప్రజలకు ఓ స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ లభిస్తే దాని ధర అందరికీ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.

 

Related posts