telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

అభ్యర్థుల ఎంపికలో రాజీ పడను: చంద్రబాబు

TDP Candidate withdraw Badwel
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా  అనంతపురం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ టికెట్లను ఆశిస్తున్న నేతలకు  తన మనసులో మాటను చంద్రబాబు వెల్లడించారు. అభిమానం ఉంటే ఇంటికి పిలిచి కాఫీ ఇస్తానని, భోజనం పెడతానని అన్నారు.  అంతే తప్ప అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడనని తేల్చి చెప్పారు. ధర్మపీఠంపై కూర్చున్న తాను ధర్మాన్నే ఆచరిస్తానని తెలిపారు. 
రానున్న ఎన్నికల్లో దుష్ట పార్టీ వైసీపీతో మనం పోటీ పడుతున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు తెలిపారు. జగన్ కు రాజకీయం చేతకాకే బీహారీ కన్సల్టెంట్ ప్రశాంత్ కిశోర్ పై ఆధారపడ్డారని ఎద్దేవా చేశారు. దుష్ట శక్తులన్నీ ఏకమై  టీడీపీపై కుట్రలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గెలిస్తే వాళ్ల ఆటలు సాగవనే భయం వారికి పట్టుకుందని పేర్కొన్నారు.  నదుల అనుసంధానం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. 

Related posts