telugu navyamedia
సినిమా వార్తలు

“స్పైడర్ మ్యాన్” అభిమానులకు షాక్

Spider-Man

“స్పైడర్‌ మ్యాన్‌” సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని వ‌య‌సుల వారూ ఇష్టపడే సూప‌ర్ హీరో “స్పైడ‌ర్ మ్యాన్‌”. మార్వెల్‌ కామిక్స్‌ నుంచి పుట్టిన ఈ చిత్రానికి ఇటీవల సీక్వెల్ గా వచ్చిన “స్పైడర్‌ మ్యాన్‌ : ఫార్‌ ఫ్రమ్‌ హోం” చిత్రం అన్ని భాషలతో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు “స్పైడర్ మ్యాన్” అభిమానులకు షాక్ ఇచ్చింది మార్వెల్ సంస్థ. మంగళవారం నాడు హాలీవుడ్ ప్రముఖ మీడియా సంస్థ ఈ విషయాన్ని ప్రచురించింది. మార్వేల్ కి సోనీ సంస్థకి మధ్య “స్పైడర్ మ్యాన్” సిరీస్ కి సంబంధించిన డీల్ ముగిసిపోనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటపెట్టడం లేదు. మార్వేల్ కి సోనీ సంస్థకి మధ్య జరిగిన చర్చల్లో ఫైనాన్షియల్ గా కొన్ని ఇష్యూలు రావడంతో ఆ ఎఫెక్ట్ ‘స్పైడర్ మ్యాన్’ సిరీస్ పై పడింది. మార్వేల్ మూవీస్ లో వచ్చే ఏ సినిమాలో కూడా ‘స్పైడర్‌ మ్యాన్‌’ కనిపించరని సమాచారం. ‘స్పైడర్ మ్యాన్’ గా నటుడు టామ్ హోలాండ్ తన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇకపై మార్వేల్ స్టూడియోస్ లో ‘స్పైడర్ మ్యాన్’ భాగం కాదనే విషయాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ‘సేవ్ స్పైడర్ మ్యాన్’ అంటూ ట్వీట్లు పెడుతున్నారు.

Related posts