telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మీ బ్లూ ఫిల్మ్ టీవీలో వచ్చేసినా పట్టించుకోవద్దు… పూరి జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు

Puri

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ “లక్డి కా పూల్” అంటూ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోడ్‌కాస్ట్‌ మీడియా అనే కొత్త దారిలో తనలోని భావాలను బయటపెట్టేశారు పూరి జగన్నాథ్. ఈ ఆడియోలో పూరి తన సొంత వాయిస్‌లో ”ఇంట్లో వాళ్ళ ఏడుపు ఎప్పుడూ.. నలుగురు ఏం అనుకుంటారో, సొసైటీలో మన పరువు పోతుందో అని. సోసిటీ అంటే ఎవరు? మహాత్మ గాంధీ, రవీంద్ర నాథ్ ఠాగూర్, అంబేద్కర్ లాంటి వాళ్ళతో నిండిపోయిందా? లేదు కదా! మనచుట్టూ 100 మంది ఉంటే అందులో మంచోళ్ళు ఐదుగురు కూడా ఉండరు. అంటే మిగతా 95 మంది వేస్ట్ అండ్ యూజ్‌లెస్. మనకంటే యెదవలు ఈ సొసైటి నిండా ఇంత మంది ఉన్నప్పుడు వాళ్ళ కోసమా నువ్వు బాధ పడేది. నీ ఇంట్లో ఎలాంటి అనర్థం జరిగినా కంగారు పడాల్సిన పని లేదు. మంచోళ్ళు ఎప్పుడూ అరథం చేసుకుంటారు. ఈ మిగితా యెదవలు అర్థం చేసుకుంటే ఏంటి చేసుకోకపోతే ఏంటి? లక్డి కా పూల్. లైఫ్ అన్నాక ఏవేవో జరుగుతుంటాయి. అనర్థం జరగని ఇల్లే ఉండదు. మనకు వచ్చిన ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించాలి కాని పరువు గురించి ఫీల్ కావొద్దు. చాలా మంది పేరెంట్స్ కొడుకో కూతురో తప్పు చేస్తే ప్రాణాలు పోయినట్లు డ్యాన్స్ ఆడుతుంటారు. పిల్లలు పెళ్లి చేసుకోవడం లేట్ అయితే కూడా ఏదో కొంపలు మునిగిపోయినట్లు కుమిలిపోతుంటారు. పెళ్లి లేట్ అవుద్ది. లేదా అవ్వదు. అయితే ఏంటి.. చంపేస్తారా? పొరపాటున మీ బ్లూ ఫిల్మ్ టీవీలో వచ్చేసినా పట్టించుకోవద్దు. రెండు రోజుల్లో అందరూ మర్చిపోతారు. కాకపోతే రెండో ప్రింట్ రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. అంతేతప్ప ఫస్ట్ రిలీజ్ గురించి మర్చిపోండి. ఈ సొసైటీకి పనీ పాటా లేదు. మనకి ఏం జరిగినా ఒకటే మంత్రం. లక్డి కా పూల్” అంటూ చెప్పుకొచ్చారు.

Related posts