telugu navyamedia
సినిమా వార్తలు

సన్నీలియోన్‌తో విష్ణు ఫన్నీ గేమ్ : వీడియో వైరల్

మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘గాలి నాగేశ్వరరావు’. ఇందులో పాయల్ రాజ్ పుత్ తో పాటుగా హాట్ బ్యూటీ సన్నీ లియోన్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ఈ సందర్భంగా సన్నీ ఇక్కడే మకాం వేసి షూటింగ్‌లో పాల్గొంటోంది. అయితే షూటింగ్ గ్యాప్ లో విష్ణుతో కలిసి చిన్న చిన్న గేమ్స్ ఆడుతూ సన్నీ సందడి చేస్తోంది.

కొద్ది రోజుల కిందట సన్నీ లియాన్ ఇలా షూటింగ్ బ్రేక్‌లో ముఖానికి మాస్క్ పెట్టుకుని విష్ణును భయపెట్టాలని చూసింది. అయితే, విష్ణు భయపడలేదు. సన్నీ మాస్క్ తీసిన వెంటనే భయపడి పరుగులు పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Sunny Leone plays funny game with Manchu Vishnu, Siva Balaji, video goes viral | ap7am

తాజాగా సన్నీలియోన్ ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేస్తూ ఈ గేమ్ ని ఇష్టపడ్డాను అని పోస్ట్ పెట్టింది. ఇందులో మధ్యలో కూర్చొని ఇద్దరినీ ఒట్టి చేతులతో కొట్టింది. ఇద్దరిలో ఏ ఒక్కరి బాటిల్ చేతికి తగిలినా మధ్యలో ఉన్నవారు ఔట్ అవుతారు .

ఇలా శివ, విష్ణుతో కలిసి సన్నీ ..ఫన్నీ గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. బాటల్స్ తో కొట్టుకునే ఈ ఆటలో ముగ్గురూ సరదా సమయాన్ని గడుపుతున్నారు.

ఈ వీడియో చూసి మరీ చిన్న పిల్లల్లా కొట్టుకుంటున్నారే అని నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.

Related posts