telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నటితో ఆకతాయిల అసభ్య ప్రవర్తన.. పోలీసుల వెతుకులాట..

two men abused kannada actress

కొడాకు పోలీసులు కన్నడ నటి హర్షిక పునాచాతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మడికెరిలో ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ లో ఈ ఘటన జరిగింది. బన్సి నానయ్య, బిపిన్ దేవయ్య అనే ఇద్దరు వ్యక్తులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని నటి హర్షిక మడికెరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మద్య నటి హర్షిక మడికెరిలోని నీరుకెల్లు రిసార్ట్ లో ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కి నటి హర్షిక మరో యాక్టర్ భువన్ తో కలిసి వెళ్లింది.

ఈ సమయంలో నానయ్య, బిపిన్ తనతో అనుచితంగా ప్రవర్తించారని హర్షిక తెలిపింది. అంతేకాదు వారితో గొడవ కూడా జరిగింది. ఈ గొడవలో భువన్ కి గాయాలు అయ్యాయి. దాంతో వారిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు నటి హర్షిక. కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేశామన్నారు. అనుచితంగా ప్రవర్తించిన వాళ్లిద్దరూ సోదరులు అని చెప్పారు. యాక్టర్ కి బంధువులు అవుతారని వివరించారు. నిందితులపై ఐపీసీ 354 (దాడి), 324 (ఉద్దేశపూర్వకంగా ఆయుధాలతో దాడి చెయ్యడం), 326 ( వెపన్స్ తో గాయపర్చడం) సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు.

Related posts