విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ సినిమా ‘ఎఫ్3’.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సోనాలి చౌహన్ కీలక పాత్రలో సందడి చేయనుంది. సమ్మర్ కానుకగా మే 27న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
ఇప్పటికే ‘ఎఫ్ 3’ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ పూర్తవ్వడమే కాదు.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను షూట్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు.
ఇందులో ఓ స్టార్ హీరోయిన్ డ్యాన్స్ చేయనుందని హీరోయిన్ బ్యాక్ సైడ్ లుక్ ని షేర్ చేస్తూ చిత్ర యూనిట్ హింట్ ఇచ్చింది. అమ్మడి బాడీ స్ట్రక్చర్ చూసి అందరూ బుట్టబొమ్మ పూజా హెగ్డే అని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ బుట్టబొమ్మ ఇప్పటికే రంగస్థలంలో “జిగేలు రాణి”గా యూత్‌ని ఉర్రూతలూగించింది.. ఇప్పుడు ఈ హాట్ సమ్మర్ లో “ఎఫ్ 3” తెరపై తన ఐటెం సాంగ్ తో మంట పెట్టడానికి రెడీ అవుతోంది. అయితే ఐటెం సాంగ్ కు ఆమెకు కోటి రెమ్యూనరేషన్ అందుతున్నట్టు తెలుస్తోంది.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ స్పెషల్ సాంగ్ కు ట్యూన్ కంపోజ్ చేశారు. పూజాహెగ్డే ఆడిపాడనున్న ఈ సాంగ్ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని భావిస్తున్నారు.