telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మళ్ళీ విడుదల కానున్న నాంది… ఓటీటీ లో…

కామెడీ హీరోగా అల్లరి నరేష్ మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ కొంతకాలంగా నరేష్ వరుస అపజయాలను చవిచూస్తున్న అతను ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన బంగారు బుల్లోడు కూడా ప్లాప్ అయింది. కానీ గత నెల విడుదలైన నాంది సినిమాతో ఎట్టకేలకు ఓ సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమాలో నరేష్ తన నట విశ్వరూపం చూపించారనడంలో అతిశయోక్తేమీ లేదు. ఈ సినిమా అందరి ఊహలను మించి అలరిచింది. అయితే వెండితెర పై అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం మార్చి 12 ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి రానున్నట్లు తెలుస్తుంది. అయితే చాలా కాలం తర్వాత నాంది సినిమాతో హిట్ అందుకోవడంతో తమ కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని నరేష్ అనుకుంటున్నారని, అందుకే అదే దర్శకుడితో మరో సినిమాకి పచ్చజెండా ఊపారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే నరేష్ తన తదుపరి చిత్రంలో ఎటువంటి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో వేచి చూడాలి మరి.

Related posts