telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మహేష్ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్…?

‘సర్కారు వారి పాట’… మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. దుబాయ్ లో నెల రోజుల పాటు సాగిన భారీ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ మొదలైంది కానీ వెంటనే కరోనా ప్రభావం కారణంగా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఇదిలా ఉంటే, సర్కారు వారి పాట విలన్ విషయంలో కన్ఫ్యూజన్ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాలో ప్రధాన విలన్ పాత్రకు పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తాజాగా ఈ పాత్రకు సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ ను తీసుకున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపైనా అధికారిక ప్రకటన వచ్చేలా కనిపిస్తోంది. అర్జున్ ఇటీవల పలు సినిమాల్లో కీలక పాత్రలో, విలన్ పాత్రల్లో నటించి మెప్పిస్తున్న విషయం తెలిసిందే. చూడాలి మరి దీని పై అధికారిక ప్రకటన వస్తుంది అనేది.

Related posts