కరోనాపై పోరులో విజయం సాధించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏడు సూత్రాలను ప్రకటించారు. ఈ రోజు జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని ప్రజలు తప్పక పాటించాల్సిన ఏడు సూత్రాలతో తాను ఓ ‘సప్తపది’ని ప్రకటిస్తున్నానని చెప్పారు. వచ్చే 19 రోజుల పాటు ఈ ఏడు ముఖ్యమైన అంశాలనూ ప్రజలు అమలు చేయాలని అన్నారు. ఈ ఏడు సూత్రాలు పాటిస్తే కరోనాపై విజయం మనదే అని మోదీ స్పష్టం చేశారు.
మోదీ ప్రకటించిన ఏడు సూత్రాలు ఇవే:
1. వయసు పైబడిన పెద్దవాళ్ల రక్షణకు చర్యలూ తీసుకోవాలి.
2. డాక్టర్లకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు గౌరవం ఇవ్వాలి.
3. పేదలకు వీలైనంత మేరకు సాయం అందించాలి.
4. ప్రైవేటు ఉద్యోగులపై యాజమాన్యాలు వేటు వేయరాదు.
5. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు పోషకాహారాన్ని తీసుకోవాలి
6. ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండీ.
7. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కూలు ధరించండి.
పార్టీలో అందరి కంటే సీనియర్ నేనే.. తనకన్నా విధేయుడు ఎవరున్నారు: వీహెచ్