telugu navyamedia
సినిమా వార్తలు

గంగూలీతో ప్రేమ వ్యవహారంపై స్పందించిన నగ్మా

Nagma

తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో స్టార్ హీరోలతో జతకట్టి 1990లలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది నటి నగ్మా. ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించి బిజీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా ఉన్నారు. ఇప్పుడు ఆమె వయసు 44 సంవత్సరాలు. ఇప్పటికీ నగ్మా పెళ్ళి చేసుకోలేదు. గతంలో టీమిండియా క్రికెటర్ సౌరవ్ గంగూలీ, నగ్మా ప్రేమించుకున్నారనే విషయం తెలిసిందే. అప్పటికే వివాహమై ఒక కూతురు ఉన్నా కూడా నగ్మాతో పెళ్ళికి సిద్ధమయ్యాడు సౌరవ్. ఇద్దరూ కలిసి శ్రీకాళహస్తిలోని ఆలయంలో పూజలు కూడా చేసిన ఈ జంట పెళ్ళి అనుకోకుండా కొన్ని కారణాలతో ఆగిపోయింది.

తాజాగా నగ్మా తన పెళ్ళి, గంగూలీతో ప్రేమ గురించి మాట్లాడింది నగ్మా. “సౌరవ్, నేను ప్రేమించుకున్న విషయం వాస్తవమే. పెళ్ళి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. కానీ నా కారణంగా సౌరవ్ కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందని అన్పించిండంతో ఈ పెళ్లిని పక్కన పెట్టాము, నాకు, సౌరవ్ కు ప్రేమకంటే ముఖ్యమైన బాధ్యతలు ఉండడంతో మా ప్రేమ పెళ్ళి వరకు రాలేదు” అంటూ చెప్పుకొచ్చారు. ఇక పెళ్ళి గురించి మాట్లాడుతూ దేవుడు రాసి పెడితే పెళ్ళి తప్పకుండా అవుతుంది. దేవుడు అందరికీ ముందుగానే ఏది, ఎప్పుడు జరగాలో రాసి పెడతాడు. అందుకే పెళ్ళి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగని నేనేం పెళ్ళికి వ్యతిరేకం కాదు అంటూ తన పెళ్ళికి సంబంధించిన విషయాలను చెప్పుకొచ్చింది నగ్మా.

Related posts