telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ ఆదివారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా “కె.జి.యఫ్” చిత్రం

kgf

కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన చిత్రం ‘కె.జి.యఫ్’ విడుదలైన అన్ని భాషలలోనూ సంచలన విజయాన్ని అందుకుంది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు. అంతేకాక ‘కె.జి.యఫ్’ చాప్టర్ 2 ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై రానున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో టాప్ స్థానంలో నిలుస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదు. అయితే ఈ చిత్రం కరోనా కారణంగా బ్రేక్ పడి.. ఎప్పుడు షూటింగ్ పూర్తవుతుందో, ఎప్పుడు విడుదల అవుతుందో కరెక్ట్‌గా చెప్పలేని పరిస్థితులను ఎదుర్కొంటుంది. అందుకే ఈ గ్యాప్‌ని చాప్టర్ 1తో ఎంజాయ్ చేయండి అంటూ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ప్రకటించింది. ‘కె.జి.యఫ్’ చాప్టర్ 1 చిత్రం ఈ ఆదివారం సాయంత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ కాబోతోంది. స్టార్ మా‌లో ఈ చిత్రం ప్రసారం కానుంది. ఇదే విషయం చెబుతూ హోంబ‌లే ఫిలింస్ సంస్థ ఈ బ్రేక్ సమయాన్ని ఇలా ఎంజాయ్ చేయండి అని ప్రకటించింది. మరి ఈ చిత్రం బుల్లితెరపై ఎటువంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో తెలియాలంటే ఆదివారం సాయంత్రం వరకు వెయిట్ చేయక తప్పదు.

Related posts