telugu navyamedia
క్రీడలు వార్తలు

బీసీసీఐకి 4 వారాల గడువు ఇచ్చిన ఐసీసీ…

ICC

వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లన్నింటినీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఇక తాజాగా- టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ నిర్వహణ కూడా డైలమాలో పడింది. భారత్‌లో టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ నిర్వహణ సాధ్యపడుతుందా? లేదా? అనేది స్పష్టం చేయాలని ఆదేశించింది. దీనికోసం డెడ్‌లైన్ కూడా పెట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అక్టోబర్ నాటికి భారత్‌లో టీ20 ప్రపంచకప్ నిర్వహించడానికి అనుకూల వాతావరణం ఉంటుందా? లేదా? అనే విషయంపై సమగ్ర నివేదికను అందజేయాలని బీసీసీఐ అధినేత సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జయ్ షాలకు సూచించింది. ఐసీసీ ఆదేశాల ప్రకారం.. ఈ నెల 28వ తేదీ నాటికి భారత్‌లో టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఓ స్పష్టతను ఇవ్వాల్సి ఉంటుంది బీసీసీఐ. ఈ ఈలోగా- అక్టోబర్ నాటి పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ మెగా ఈవెంట్ ఆరంభం అయ్యే సమయానికి భారత్‌లో కరోనా వైరస్ స్థితిగతులపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వేర్వేరు దేశాల నుంచి భారత్‌కు వచ్చే క్రికెట్ జట్లు, వాటితో పాటు వచ్చే సపోర్టింగ్ టీమ్, గ్రౌండ్ స్టాఫ్, మ్యాచ్‌లను కవర్ చేయడానికి వచ్చే వివిధ దేశాల మీడియా ప్రతినిధులు, వారికి కల్పించాల్సిన వసతి.. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని- బీసీసీఐ సమగ్ర నివేదికను అందజేయాల్సి ఉంటుంది.

Related posts