telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులు : వాహనదారులకు గుడ్‌ న్యూస్‌

ఇటివల కాలంలో మందు కొట్టి వాహనాలను నడుపుతూ పట్టుబడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటంతో హైదరాబాద్‌ పరిధిలో సాయంత్రం నుంచే డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తున్నారు. దీంతో అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలోనే ఈ తనిఖీలు ఉండటంతో… ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో వాహనదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు స్పందించారు. రాత్రి 9 గంటల్లోపు డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించేందుకు సరైన సమయం కాదని భావించిన ట్రాఫిక్‌ విభాగం.. ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9:30 గంటల తర్వాతనే డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మందుబాబులు కూడా 10 గంటల తరువాతనే రోడ్లపైకి వస్తారన్న అంచనాతోనే, అన్ని పోలీసు స్టేషన్ పరిధిలో రాత్రి 9:30 తరువాతే డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించినట్లు ట్రాఫిక్‌ వర్గాలు తెలిపాయి.

Related posts