telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బండి సంజయ్ ‌పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్‌…

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్‌ పార్టీ. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథిని కలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.. శుక్రవారం రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పై బండి సంజయ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్ పై చిల్లరగా, వెకిలిగా మాట్లాడటం ఆయనకే చెల్లుతుందన్నారు.. ప్రచారంలో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదని మండిపడ్డ ఆయన.. బండి సంజయ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి, ఎన్నికల్లో ప్రచారం చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఒక పార్లమెంటు సభ్యుడు అయిన సంజయ్.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ… మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. అవగాహన లేకుండా చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారు. చట్టప్రకారం ఎంపీ సంజయ్ పై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. చూడాలి మరి ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది.

Related posts