telugu navyamedia
సినిమా వార్తలు

ఈ హాట్ బ్యూటీ పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్… డెలివరీకి ముందు పెళ్ళి…!

Amy-Jackson

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అతితక్కువ కాలంలోనే తన గ్లామర్ తో భారీగా అభిమానులను సంపాదించుకుంది యంతరలోకపు సుందరి అమీ జాక్సన్. ఇక తెలుగులో ఆమె తక్కువ సినిమాలే చేసినప్పటికీ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అమీ జాక్సన్ చివరిగా సూపర్ స్టార్ రజనీకాంత్‌ సరసన “2.ఓ” కన్పించింది. అయితే ఈ హాట్ బ్యూటీ త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కనుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ ఫోటో ద్వారా వెల్లడించింది. బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త జార్జ్‌ పనయటోతో జాంబియాలో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అయితే వీరి పెళ్లికు ముందే అమీజాక్సన్ ప్రెగ్నెన్సీ అన్న వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. వాటిని నిజం చేస్తూ పెళ్లి కాకుండానే గర్భవతి అయిన ఈ భామ తనకు కాబోయే భర్తతో కలిసి తిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. బేబీ బంప్‌తో స్పెషల్‌ ఫొటో షూట్‌ చేయించుకుంది. ప్రస్తుతం ఆమెకు ఏడవ నెల అని తెలుస్తోంది. అమీజాక్సన్‌ తన ప్రియుడు జార్జ్‌ను త్వరలో పెళ్లి చేసుకోనుంది. గత కొంతకాలంగా ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్న వీరు చివరికి పెళ్లికి సిద్ధమయ్యారు. డెలివరీలోపే పెళ్లికి రంగం సిద్ధం చేస్తున్నారట అమీజాక్సన్‌ కుటుంబ సభ్యులు. ఇటలీలో ఆమె వివాహానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇంకా పెళ్లికి డేట్‌ ఫిక్స్‌ కాలేదని తెలిసింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న అమీ జాక్సన్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఎప్పుడు ఇస్తుందో చూడాలి.

Related posts