telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విద్యాబాల‌న్ షార్ట్ ఫిల్మ్ “నట్కత్” ఫ‌స్ట్ లుక్‌

Natkhat

బాలీవుడ్ బ్యూటీ విద్యాబాల‌న్ తొలిసారి అనే ల‌ఘుచిత్రంలో న‌టించింది. “న‌ట్క‌త్” అనే టైటిల్‌తో రూపొంద‌నున్న ఈ ప్రాజెక్ట్‌ని రోని స్క్రూవాలాతో క‌లిసి నిర్మిస్తుంది విద్యా. తాజాగా షార్ట్ ఫిలింకి సంబంధించిన లుక్ విడుద‌ల చేయ‌గా ఇందులో చీర ధ‌రించి పిల్లాడికి మాసాజ్ చేస్తున్న‌ట్టు క‌నిపిస్తుంది. గ‌త ఏడాది ఈ ఫిలిం షూటింగ్ పూర్తి కాగా, విడుద‌ల‌కి చాలా స‌మ‌యం ప‌ట్టింది. తాజాగా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌పై ఏక్తా క‌పూర్, దియా మీర్జా, అదితిరావు హైద‌రి, మాన్వి గ‌గ్రూ, కీర్తి సురేష‌న్ స్పందించారు. మ‌రోవైపు హ్యూమన్ కంప్యూటర్‌గా పేరొందిన ప్రఖ్యాత గణిత శాస్త్ర వేత్త శకుంతలా దేవి బ‌యోపిక్‌లో విద్యా బాల‌న్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. “శ‌కుంత‌లా దేవి” అనే పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి కొన్ని రోజుల క్రితం పోస్ట‌ర్ విడుద‌ల కాగా, ఇది ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంది. అను మీనన్ దర్శకత్వం వహించిన‌ ఈ చిత్రాన్ని లెడ్ అబుందంటియా ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది చిత్రాన్ని థియేట‌ర్స్‌లోకి తీసుకురావాల‌ని భావించిన‌ప్ప‌టికీ, లాక్‌డౌన్ వ‌ల‌న ఓటీటీలో విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు సిద్ధ‌మయ్యారు.

Related posts