telugu navyamedia
సినిమా వార్తలు

జెండాను ఎగురవేసిన ‘మా’ స‌భ్యులు..

 

భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి నేటికి 75 సంవత్సరాలు అవుతోంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మ‌తాలు, కులాల‌కు అతీతంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో మా మెంబ‌ర్స్ జాతీయ జెండాను ఆవిష్క‌రించారు.

ఇందులో భాగంగానే ..మట్టిని ప్రేమించేవాడు దేశాన్ని ప్రేమిస్తాడు, దేశాన్ని ప్రేమించేవాడే మనుషుల్ని ప్రేమిస్తాడు. మనవాళ్ల కోసం ఆలోచించడం కన్నా దేశభక్తి మరొకటి లేదు అన్న నినాదంతో స్వేచ్ఛను, స్వచ్ఛతను, సమసమాజ న్యాయాన్ని కోరుకుంటూ.. ‘మా’ శ్రేయస్సు కోసం.. మనకోసం మనం.. ‘మా’ కోసం మనం అంటూ కదిలి వచ్చి భారత పౌరులుగా గర్విస్తూ గతాన్ని స్మరించుకుంటూ వర్తమానంలోంచి భవిష్యత్తులోకి ఆచరణాత్మక దిశగా అడుగులు వేస్తూ 75వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేసి జనగణమన జాతీయ గీతాన్ని సిని‘మా’ బిడ్డలుగా ఆలపించి వేడుకలు జరుపుకున్నారు.

మ‌రోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ వేడి పుట్టిస్తున్నాయి. మా సభ్యుల వాదోపవాదాలతో మా ఛాంబర్ దద్దరిల్లుతుంది. మా ప్రస్తుత కార్యవర్గం గడువు కాలం సెప్టెంబర్ వరకు ఉన్నప్పటికి మా ఎన్నికలు వెంటనే నిర్వహించాలనే డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. మా మెంబ‌ర్స్‌ ఒకరి పై ఒకరు దుమ్మెతి పోసుకుంటున్నారు. మా ఎన్నికలు వెంటనే జరపాలని ఇటీవ‌ల ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మెగాస్టార్‌ చిరంజీవి.. డీఆర్‌సీ చైర్మన్‌ కృష్ణంరాజుకు లేఖ రాశారంటేనే అర్ధం చేసుకోవచ్చు. అలాగే తాజాగా జెండా ఎగరేస్తామంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. అనుకున్న విధంగా జెండా ఎగుర‌వేశారు.

 

Related posts