మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో “ప్రతిరోజు పండగే” సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ హీరో నటించిన “చిత్రలహరి” మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ మెగా హీరో తన పర్సనల్ లైఫ్ గురించి అభిమానులతో పంచుకున్నారు. తాజాగా తన ప్రేమ, బ్రేకప్ విషయాలపై స్పందించాడు ఈ హీరో. తన లైఫ్ లో ఓ అమ్మాయి ఉండేదని కానీ తనకు దూరమైందని చెప్పుకొచ్చాడు. కాలేజ్ డేస్ లో తేజ్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడట. తనకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.కాలేజ్ పూర్తయిన తరువాత సాయి ధరం తేజ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఐదేళ్ల సమయం పట్టింది. ఆ సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ తో దూరం పెరిగిందని చెప్పుకొచ్చాడు. బ్రేకప్ జరగడానికి సరైన కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇక ఇండస్ట్రీలో వినిపించే రూమర్స్ పై స్పందిస్తూ..’నేను చాలా మంది హీరోయిన్లతో సన్నిహితంగా ఉంటాను. దాని కారణంగా డేటింగ్ రూమర్లు వస్తున్నాయి. కానీ వారంతా నాకు మంచి ఫ్రెండ్స్ మాత్రమే’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సాయి ధరం తేజ్ ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. కానీ తను సెటిల్ అయిన తరువాతే పెళ్లి చేసుకుంటానని తన తల్లికి చెప్పేశాడట.
previous post