telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

‘ఆదిపురుష్’ సెట్ లో అగ్నిప్రమాదం…

ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్‌తో చేయనున్న ఆదిపురుష్ కూడా ఒకటి. అయితే ప్రస్తుతం ప్రభాస్ వేరే సినిమాతో బిజీగా ఉండటంతో ప్రభాస్ లేకుండానే ఓంరౌత్ ఆదిపురుష్‌ కు సంబంధించిన చిత్రీకరణ పనులను కూడా మొదలుపెట్టేశాడు. అయితే ఈ సినిమా మొదటి రోజు సెట్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చిత్ర యూనిట్ తొందరగా అప్రమత్తం అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముంబైలో జరిగిన ఈ అగ్నిప్రమాద విజువల్స్ బట్టి చూస్తే షూటింగ్ సెట్ పూర్తిగా దగ్ధం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్న బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పాల్గొననున్నాడు. ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడని, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రను పోషించనున్నాడు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది.

Related posts