telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తమన్నా క్షమాపణలు చెప్పాల్సిందే అంటున్న స్టార్ హీరో ఫ్యాన్స్… ఎందుకంటే ?

Tamannah

సాధారణంగా ప్రతి స్టార్ హీరోకు కూడా అభిమానులు ఉంటారు. కానీ కొన్నిసార్లు వారి అభిమానం హద్దులు దాటి ఇతరులను ఇబ్బందుల పాలు చేస్తుంటుంది. మరీ ముఖ్యంగా తమిళంలో విజయ్, అజిత్ అభిమానుల గొడవలు విచిత్రంగా ఉంటాయి. అజిత్ అభిమానులు తమ హీరో సినిమా గురించి విమర్శించిందని చిన్మయిని ఇలాగే టార్గెట్ చేశారు. తాజాగా విజయ్ ఫ్యాన్స్ తమన్నా మీద ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ప్రారంభించేశారు. అసలు తమన్నా విజయ్ గురించి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఏమందంటే… “విజయ్ సర్ గురించి నాకేం తెలియదు. ఒక సినిమాలో ఆయనతో కలిసి నటించాను. కానీ, ఆ సమయంలో ఆయనకు, నాకు మధ్య ఎక్కువ కమ్యూనికేషన్ లేదు. ఆయన పనేదో ఆయనది అన్నట్టు ఉండేవారు. షూటింగ్‌కు వెళ్లామా? వచ్చామా? అన్నట్టు ఉండేది. అలాంటి వ్యక్తి గురించి నేనేం మాట్లాడను. ఆయన గురించి ఏమీ తెలియకుండా కామెంట్ చేయలేను” అని చెప్పింది తమన్నా. దానికే విజయ్ ఫ్యాన్స్ హర్టయ్యారు. తమన్నా తమ హీరోకు క్షమాపణలు చెప్పాల్సిందేనని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి దీనిపై తమన్నా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక విజయ్ దీని గురించి ఏమైనా మాట్లాడతారా ? లేదా ? అనేది కూడా తెలియాల్సి ఉంది.

Related posts